విజృంభిస్తున్న విష జ్వరాలు.. వైద్యారోగ్య శాఖ తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి? - జ్వరాల ముట్టడి
Prathidhwani: ఇంటికి ఒకరు మంచం పడుతున్నారు. డెంగీ, విష జ్వరాలు తీవ్రస్థాయిలో వణికిస్తున్నాయి. ప్రస్తుతం ఉభయ తెలుగురాష్ట్రాల్లో ఇదే పరిస్థితి. ఒకవైపు సాధారణ ఫ్లూ జ్వరాలు, మరొకవైపు... డెంగీ, మలేరియాలు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పారిశుద్ధ్య లోపాలు, దోమలవ్యాప్తి సమస్య తీవ్రతను పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు జ్వర పీడితులతో కిటకిటలాడుతున్నాయి. కొన్నిచోట్ల జ్వరాలతో మృత్యువాత పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇది ఏటా వానాకాలం వచ్చే ఇబ్బందే అయినా... ఈసారి అసాధారణ రీతిలో ఈ అనారోగ్యాలు ఎందుకు కలవర పెడుతున్నాయి. ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు, వైద్యారోగ్య శాఖ యంత్రాంగం ఇప్పుడు తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.