రోడ్లపై జంతువులు హల్చల్.. వృద్ధుడు మృతి.. చిన్నారికి గాయాలు - హరియాణా వృద్ధుడు మృతి
హరియాణాలోని పలు నగరాల్లో జంతువులు విచ్చలవిడిగా సంచరిస్తున్నాయి. ప్రజలను గాయపరుస్తూ ఆసుపత్రి పాలు చేస్తున్నాయి. కర్నాల్‌లోని మోతీనగర్‌లో నివాసం ఉంటున్న మహేంద్ర శర్మ(78) తన ఇంటి గేటు ముందు కుర్చీపై కూర్చున్నారు. అదే సమయంలో అటు వచ్చిన ఓ ఎద్దు.. వృద్ధుడ్ని గాయపరిచింది. తీవ్రగాయాలతో చికిత్స పొందుతూ.. ఆయన ఆసుపత్రిలో మరణించారు. మరోవైపు, రేవాడీలోని హన్స్నగర్లో ఓ ఐదేళ్ల చిన్నారి దుకాణానికి వెళ్తున్న సమయంలో ఆవు దాడి చేసింది. కొమ్ములతో పొడిచేసింది. ప్రస్తుతం ఆ చిన్నారి గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ రెండు ఘటనలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి.