ఉవ్వెత్తున ఉరకలేస్తున్న కృష్ణమ్మ - flow
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం జలాశయానికి వరద నీరు పోటెత్తుతోంది. భారీగా నీరు చేరడం వల్ల జలాశయంలోని 10 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఒకేసారి 10 గేట్ల నుంచి ఉరకలేస్తున్న కృష్ణమ్మ పరవళ్లు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. నింగి నుంచి జాలివారుతున్న పాలధారల్లా ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న జలధారలతో ఆ ప్రాంతమంతా ముగ్ధమనోహరంగా కనువిందు చేస్తోంది.