ఆటో ఎక్కుతుండగా విద్యార్థులకు కరెంట్ షాక్, ఒక్కసారిగా - ఇద్దరు విద్యార్థులకు కరెంట్ షాక్
ఉత్తరాఖండ్‌లోని దేహ్రాదూన్‌లో త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డారు ఇద్దరు విద్యార్థులు. నగరంలోని సెయింట్ థామస్ స్కూల్లో చదువుతున్న స్టూడెంట్స్.. ఆటో కోసం సమీపంలో ఉన్న బస్‌స్టాప్‌లో వేచిచూస్తున్నారు. అదే సమయంలో భారీగా వర్షం కురుస్తోంది. ఆటో వచ్చిందనే హడావుడిలో ఎక్కేందుకు ఓ విద్యార్థి వర్షపు నీటిలో దిగాడు. ఆటోను టచ్ చేసిన వెంటనే కరెంట్ షాక్‌కు గురయ్యాడు. ఆ తర్వాత మరో విద్యార్థిని కూడా ఆటో ఎక్కేందుకు ప్రయత్నించింది. ఒక్కసారిగా విద్యుదాఘాతానికి గురై వరద నీటిలో పడిపోయింది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు.. ఇద్దరు చిన్నారులను కాపాడారు.