తెలంగాణ

telangana

ETV Bharat / videos

నీటి గుంతలో పడిపోయిన ఏనుగు.. పొక్లెయిన్​ సాయంతో.. - ఝార్ఖండ్​ ఏనుగును కాపాడిన స్థానికిలు

By

Published : Jun 27, 2022, 11:27 AM IST

ఆహారం కోసం జనవాసాల్లోకి వచ్చిన ఓ గజరాజు.. నీటి గుంతలో పడిన సంఘటన ఝార్ఖండ్‌లో జరిగింది. రామ్‌గఢ్‌ జిల్లా హులు గ్రామంలోకి ప్రవేశించిన ఓ ఏనుగు వ్యవసాయ క్షేత్రంలోని నీటి గుంతలో పడిపోయింది. వెంటనే గమనించిన గ్రామస్థులు.. అధికారులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన స్థానిక ప్రభుత్వ అధికారులు ఏనుగును రక్షించేందుకు తీవ్రంగా శ్రమించారు. పొక్లెయిన్​ సాయంతో నీటి గుంత నుంచి గజరాజు బయటపడేలా చేశారు. చెరకు తినడానికి అలవాటు పడిన గజరాజులు.. వాటి కోసం రోడ్డుపైకి వచ్చి వాహనాలకు అడ్డగిస్తున్న సంఘటనలు జరిగాయి.

ABOUT THE AUTHOR

...view details