దంచికొట్టిన వర్షం... ఇబ్బందుల్లో భాగ్యనగరం
ఎడతెరిపిలేకుండా రాత్రంతా దంచికొట్టిన వానకు భాగ్యనగరవాసులు బెంబేలెత్తిపోయారు. రహదారులన్నీ జలమయమై చెరువుల్ని తలపించాయి. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఇళ్లలోకి వరద నీరు చేరి ప్రజలకు రాత్రంతా కంటి మీద కునుకు లేకుండా చేసింది. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలే గాక లాలాగూడలోని రైల్వే ఆస్పత్రి ఎమర్జెన్సీ వార్డులోకి వరద నీరు చేరింది. నాచారం పోలీస్ స్టేషన్లోకి చేరిన నీటిని పోలీసులు బయటకు ఎత్తిపోశారు. శామీర్‌పేటలోని ఫౌల్ట్రీఫారమ్లోకి నీరు చేరి వేల సంఖ్యలో కోళ్లు మృతిచెందాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది.
Last Updated : Sep 25, 2019, 11:48 AM IST
TAGGED:
rain effect in hyderabad