తెలంగాణ

telangana

ETV Bharat / videos

ప్రతిధ్వని: దేశంలో ఇంజినీరింగ్‌ విద్యా ప్రమాణాలు ఏ స్థాయిలో ఉన్నాయి? - ప్రతిధ్వని చర్చలు

By

Published : Jul 27, 2021, 9:52 PM IST

దేశంలో ఇంజినీరింగ్‌ విద్యా ప్రమాణాలపై విమర్శలు నానాటికీ పెరుగుతున్నాయి. కళాశాలల నిర్వహణలో అవాంఛనీయ ధోరణులు మితిమీరాయన్న ఆరోపణల నేపథ్యంలో ఇంజినీరింగ్‌ కోర్సులపై భరోసా సన్నగిల్లుతోంది. కళాశాలలకు లక్షలాది రూపాయలు ధారపోసి ఇంజినీరింగ్‌ కోర్సులు చదివిస్తున్నా.. సగం మంది ఇంజినీరింగ్‌ పట్టభద్రులు కూడా ఉద్యోగాలు సాధించడం లేదు. ఫలితంగా ఇంజినీరింగ్‌ కోర్సులపై ఏటేటా విద్యార్థుల్లో ఆసక్తి తగ్గుతోంది. ఈ మేరకు కాలేజీల్లోనూ సీట్లు భర్తీకాని పరిస్థితి. అసలు దేశంలో ఇంజినీరింగ్‌ విద్యా ప్రమాణాలు ఏ స్థాయిలో ఉన్నాయి? దేశీయ అవసరాలకు అనుగుణంగా కాలేజీలు ఇంజినీర్లను తీర్చిదిద్దుతున్నాయా? అధ్యాపకుల బోధన నైపుణ్యాలను, విద్యార్థుల అభ్యసన పద్ధతులను సానబెట్టడం ఎలా? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని చర్చ.

ABOUT THE AUTHOR

...view details