ప్రతిధ్వని: జమ్ము వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి దేనికి సంకేతం? - drone attack on jammu air force station
జమ్ముకశ్మీర్‌లో భారత వైమానిక స్థావరంపై జరిగిన డ్రోన్ దాడి దేశ ప్రజలను ఉలిక్కిపడేలా చేసింది. కశ్మీర్ లోయలో శాంతిని నెలకొల్పేందుకు భారత ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటున్న పూర్వరంగంలో ఈ దుశ్చర్య చర్చనీయాంశమైంది. ఈ దాడి చేసిన ముష్కరులు ఎవరు? వారి వెనుక ఎవరు ఉన్నారు? ఉగ్రవాదుల పీచమణిచేందుకు భారత బలగాలు ఇంకా ఎటువంటి సాంకేతిక సాధన సంపత్తిని సమకూర్చుకోవాలి అనే అంశాలపై నేటి ప్రతిధ్వని చర్చ.