Prathidwani: ఏళ్లు గడుస్తున్నా పూర్తి కాని డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలు.. - Telangana Prathidwani
Prathidwani: రాష్ట్రంలో రెండు పడకగదుల ఇళ్ల నిర్మాణం నత్తనడకన సాగుతోంది. ప్రభుత్వ హామీ మేరకు ప్రజలు రెండు పడక గదుల ఇళ్ల కోసం లక్షల సంఖ్యలో దరఖాస్తులు చేసుకున్నారు. కానీ ఇప్పటికే పూర్తైన ఇళ్లనూ ప్రభుత్వం లబ్దిదారులకు అందించేందుకు ముందుకు రావడం లేదు. మరోవైపు నిర్మాణం పూర్తైన ఇళ్లకు ప్రభుత్వం నుంచి బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్లు కొన్నిచోట్ల పనులు నిలిపేస్తున్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్లకు కేంద్రం ఇస్తున్న రాయితీ నిధులు భారీగా పెండింగ్‌లో ఉన్నాయని, అవి విడుదలైతే పనులు మరింత వేగంగా జరుగుతాయని రాష్ట్రం చెబుతోంది. అసలు డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణంలో కేంద్రం, రాష్ట్రం మధ్య సమన్వయం ఉందా? నిధులు విడుదల, నిర్మాణ పనుల్లో జాప్యం ఎందుకు? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని.