భారత్- దక్షిణాఫ్రికా రెండో టీ20 టికెట్ల కోసం ఎగబడ్డ అభిమానులు..పోలీసుల లాఠీచార్జ్ - బారాబతి స్టేడియంలో లాఠీచార్జ్
భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఆదివారం జరిగే రెండో టీ20 మ్యాచ్ టికెట్లు కోసం అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో ఒడిశాలోని కటక్ బారాబతి స్టేడియం కిక్కిరిసిపోయింది. గురువారం రాత్రి నుంచే క్యూలో నిలబడి టికెట్లు దక్కించుకునేందుకు ఎగబడ్డారు. పరిస్థితులు అదుపు తప్పడం వల్ల పోలీసులు లాఠీచార్జ్ చేశారు. జూన్ 7న ఒడిశా క్రికెట్ అసోసియేషన్ గుర్తింపు పొందిన సంస్థలకు టికెట్లు జారీ చేయగా.. జూన్ 9, 10 తేదీల్లో సాధారణ ప్రజలకు అందుబాటులో ఉంచారు.