వామ్మో.. అది ఆటోనా? లేక బస్సా?.. ఏకంగా 27 మందితో ఫుల్ స్పీడ్‌గా - up auto 27 members
27 Passengers In Auto: సాధారణంగా ఆటోలో గ్యాప్ లేకుండా ఓ పది మంది కూర్చొని ప్రయాణించడం చూస్తుంటాం. కానీ, ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫతేపుర్‌లో ఓ ఆటోలో కూర్చున్న ప్యాసింజర్లను చూసి పోలీసులు షాకయ్యారు. 7 సీటర్ ఆటోలో ఏకంగా 27 మంది కూర్చొని ఉండగా, ఓవర్‌స్పీడ్‌తో ప్రయాణిస్తున్న ఆటోను ఆపిన పోలీసులకు మతిపోయింది. కేవలం ఏడుగురు మాత్రమే ప్రయాణించే సామర్థ్యం ఉండగా ఆ డ్రైవర్.. వృద్ధులు, చిన్నారులతో సహా 27 మందిని అంగుళం కూడా గ్యాప్ లేకుండా ఎక్కించాడు. పోలీసులు వారందరినీ కిందికి దింపి లెక్కించారు. అనంతరం డ్రైవర్‌పై కేసు నమోదు చేసి ఆటోను సీజ్ చేశారు. రూ.11,500 జరిమానా కూడా విధించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అంతమందితో ఆ ఆటో ఓవర్‌స్పీడ్‌లో వెళ్తోందంటే దీన్ని గిన్నిస్‌బుక్‌లో ఎక్కించాల్సేందేనని నెటిజన్లు సరదాగా కామెంట్లు పెడుతున్నారు.