కోతులను చెట్టుకు వేలాడదీసిన దుండగులు.. రెండు వానరాలు మృతి - చెట్టుకు కోతులు ఉరి
కర్ణాటకలోని బీదర్లో నాలుగు కోతులను చింతపండు చెట్టుకు వేలాడదీశారు దుండగులు. అయితే వాటిలో రెండు వానరాలు మరణించగా.. మరో రెండు కోతులు తప్పించుకుని పారిపోయాయి. ఈ దుశ్యర్యకు పాల్పడిన దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని భజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు, స్థానికులు డిమాండ్ చేశారు. చనిపోయిన కోతుల మృతదేహాలకు యువకులు అంత్యక్రియలు నిర్వహించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు.