హ్యాపీ బర్త్డే మోదీ.. చాయ్ కప్పులతో సైకతశిల్పం.. ఆ వీరాభిమాని 8 ఏళ్లుగా.. - narendra modi AGE
Modi Birthday Wishes : ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు వినూత్నంగా శుభాకాంక్షలు చెప్పారు ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్. 1213 మట్టి టీకప్పులను ఉపయోగించి మధ్యలో మోదీ చిత్రంతో ఒడిశా పూరీ బీచ్లో సైకత శిల్పం రూపొందించారు. అందులో హ్యాపీ బర్త్డే మోదీ అని రాసుకొచ్చారు. ఈ 5 ఫీట్ల పొడవున్న ఆకృతి కోసం పట్నాయక్ 5 టన్నుల ఇసుక వాడారు. ఉత్తర్ప్రదేశ్ వారణాసిలోని మోదీ వీరాభిమాని విజయ్ గుప్తా.. ప్రధాని జన్మదిన వేడుకలను ప్రత్యేకంగా జరుపుకుంటున్నాడు. గత 8 ఏళ్లుగా ప్రధాని చేసిన అభివృద్ధి పనులు, విదేశీ పర్యటనలు, ఇతర కార్యక్రమాలకు సంబంధించిన పేపర్ కటింగ్లను తన పాన్ షాపులో అతికించుకోవడం విశేషం. ఇదిప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది. ప్రధాని 72వ జన్మదినం సందర్భంగా.. భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, పలు రాష్ట్రాల సీఎంలు సహా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు చెప్పారు.