'మాటకు లొంగని వ్యక్తి హృదయ స్పందనకు లొంగుతారు' - అలయ్ బలయ్ కార్యక్రమంలో పాల్గొన్న మెగాస్టార్
అలయ్ బలయ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నానని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. కుల మతాలకు అతీతంగా నిర్వహించే కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతిలో అంతర్భాగంగా ఉన్న అలయ్ బలయ్ దేశవ్యాప్తం కావాలని ఆకాంక్షించారు. పవన్‌కల్యాణ్, అల్లు అరవింద్‌కు ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం వచ్చిందన్నారు. దత్తాత్రేయ మా ఇంటికి వచ్చి ఆహ్వానించారని, మాటకు లొంగని వ్యక్తి హృదయ స్పందనకు లొంగుతారని ఈ వేడుక సందర్భంగా అన్నారు.