ఆలయాల్లో పూజలు హుండీల్లో చోరీలు అడ్డంగా బుక్కైన ప్రేమజంట - శ్రీ మహారాజ స్వామి
ఆలయాల్లో పూజలు చేసి హుండీల్లో దొంగతనాలకు పాల్పడుతోంది ఓ ప్రేమజంట. ఈ ఘటన కర్ణాటక ఉడుపిలో వెలుగుచూసింది. మరవంతె ఆలయ గర్భగుడిలోకి ప్రవేశించిన యువ ప్రేమజంట చోరీకి విఫలయత్నం చేసింది. సంబంధిత దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ఈ ఘటన ఆగస్టు 9న జరిగినట్లు తెలుస్తోంది. తలుపులు పగులకొట్టి కుందాపుర్ త్రాసి సమీపంలోని శ్రీ మహారాజా స్వామి, శ్రీ వరాహ ఆలయంలోకి ప్రవేశించారు యువతీ యువకులు. వరాహ విష్ణు నరసింహుని విగ్రహాన్ని తాకి అపవిత్రం చేసిన యువకుడు అక్కడ ఏమీ దొరక్క ఖాళీ చేతులతో తిరిగివచ్చాడు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా.. కేసు నమోదు చేసుకున్న గంగోళ్లి పోలీసులు.. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. వీళ్ల కదలికలపై ఆరా తీస్తున్నారు.