వీడు మనిషేనా..? పెన్షన్ కోసం నాయనమ్మపై ఇంత పైశాచికత్వమా..? - పెన్షన్ కోసం నాయనమ్మపై మనుమడి పైశాచిక దాడి
Grandson attack on grandmother: పెన్షన్ డబ్బులు కోసం నాయనమ్మపై విచక్షణారహితంగా దాడికి దిగాడు ఓ మనుమడు. వృద్ధురాలైన నాయనమ్మను మద్యం మత్తులో నోటికొచ్చినట్టు తిడుతూ.. ఎటుపడితే అటు కాళ్లతో తన్నుతూ.. దారుణంగా దాడి చేశాడు ఆ కర్కోటకుడు. ఈ అమానవీయ ఘటన వికారాబాద్ జిల్లాలో చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పెద్దెముల్ మండలం మంబాపూర్కు చెందిన చింది యశోదమ్మకు ఇటీవలే కొత్త పెన్షన్ మంజూరైంది. మద్యానికి బానిసైన తన మనవడు గోవర్దన్.. ఆమెకు వచ్చిన పెన్షన్ డబ్బులు ఇవ్వాలని దాడికి తెగబడ్డాడు. వృద్ధురాలు అని కూడా చూడకుండా.. చేతులతో కొడుతూ కాళ్లతో తంతూ.. పశువులా ప్రవర్తించాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు స్థానికులు చరవాణుల్లో రికార్డు చేయగా.. అవి కాస్తా సామాజిక మధ్యామాల్లో వైరల్ అయ్యాయి. దాడి చేసిన యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేసి.. అదుపులోకి తీసుకున్నారు.