మైనర్ కిడ్నాప్‌కు విఫలయత్నం, కరెంట్ స్తంభానికి కట్టి చితకబాదిన గ్రామస్థులు - మధ్యప్రదేశ్ లేటస్ట్ అప్డేట్స్
మధ్యప్రదేశ్‌లోని బినాగంజ్‌లో ఓ 13 ఏళ్ల మైనర్ కిడ్నాప్ చేసేందుకు యత్నించిన నిందితులను విద్యుత్ స్తంభానికి కట్టేసి చితకబాదారు గ్రామస్థులు. ఈ దాడికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాధితురాలు కోచింగ్‌కు వెళ్లేందుకు ఉదయం ఇంటి నుంచి బయలుదేరింది. మార్గమధ్యలో మద్యం మత్తులో ఉన్న నిందితులు బాలికను కిడ్నాప్ చేసేందుకు యత్నించారు. అయితే బాలిక వారివద్ద నుంచి తప్పించుకుని ఇంటికి చేరుకుని జరిగిందంతా తల్లిదండ్రులకు చెప్పింది. మరుసటి రోజు ఆ బాలికను తన తండ్రి బైక్‌పై స్కూల్‌కు తీసుకెళ్తుండగా.. ఆ ఇద్దరిని గుర్తుపట్టి తండ్రికి చూపించింది. దీంతో వెంటనే తండ్రి బైక్ ఆపి వారిద్దరిని పట్టుకున్నాడు. అప్పటికే ఆ ప్రాంతంలో గుమిగూడిన గ్రామస్థులు వారిని కరెంట్ స్తంభానికి కట్టేసి చితకబాది ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు.
Last Updated : Oct 15, 2022, 12:28 PM IST