వరుడి ఐడియా అదుర్స్ గురూ.. 51 ట్రాక్టర్లతో భారీ ర్యాలీగా.. ఎందుకో తెలిస్తే! - రైతు పెళ్లి ఊరేగింపు
Farmer marriage procession tractor: పెళ్లి ఊరేగింపునకు వరుడు వినూత్న ఆలోచన చేశాడు. 51 ట్రాక్టర్లతో పెళ్లి కుమార్తె ఇంటికి ఊరేగింపుగా వెళ్లాడు. తానే స్వయంగా ట్రాక్టర్ నడిపాడు. రాజస్థాన్లోని బాడ్మేర్కు చెందిన రాధేశ్యామ్ అనే రైతు ఇలా చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. రైతులకు గుర్తింపును ఇచ్చేందుకే ఇలా పెళ్లి వేడుక నిర్వహించినట్లు పెళ్లి కుమారుని తండ్రి సోనారామ్ అన్నాడు. సుమారు ఈ ఊరేగింపులో 150 మంది పాల్గొన్నారు.