PRATHIDWANI: వినోదం మాటున విశృంఖలత్వం.. పబ్‌లపై పర్యవేక్షణ ఉందా..? - హైదరాబాద్ తాజా వార్తలు
మైనర్‌పై అత్యాచార ఘటన ప్రకంపనలు కొనసాగుతునే ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పుడు అదే అంశంపై తీవ్రంగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే అనేక ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. హేయమైన నేరంలో నిందితులు కూడా మైనర్లే ఉండడాన్ని ఎలా చూడాలి? అసలు ఆ వయసు వారిని పబ్‌ల్లోకి అనుమతించడం ఏమిటి? వరస ఘటనల్లో వివాద కేంద్రాలుగా ఉంటున్న నగర పబ్‌లపై అసలు పర్యవేక్షణ ఉందా..? పోలీసులు, ఆబ్కారీశాఖ తమ పని తాము పకడ్బందీగా నిర్వహిస్తున్నాయా? ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్ర అన్నట్లు.. సంస్కృతి, మానవతా విలువలు, సరైన పెంపకం విషయంలో గమనించాల్సిన ఏమిటి? ఇదే అంశంపై నేటి ఈటీవీ భారత్ ప్రతిధ్వని.