తెలంగాణ

telangana

ETV Bharat / videos

PRATHIDWANI: బిహార్‌లో ఓబీసీ కులగణనతో ఇతర రాష్ట్రాలపై పడే ప్రభావమేంటి? - హైదరాబాద్ తాజా వార్తలు

By

Published : Jun 3, 2022, 9:54 PM IST

PRATHIDWANI: బిహార్‌ రాష్ట్రంలో కులాల వారీగా జనాభా లెక్కింపు జరుపుతామని సీఎం నితీశ్‌ కుమార్‌ ప్రకటించారు. దీంతో దేశవ్యాప్తంగా కులగణన డిమాండ్లకు కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలతోపాటు మహారాష్ట్ర, తమిళనాడు వంటి రాష్ట్రాలు బీసీ కులాల జనగణన కోసం కొంతకాలంగా కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నాయి. అదే జరిగితే దేశ రాజకీయాల్లో విపరీత పరిణామాలు చోటుచేసుకుంటాయన్న ఆందోళన కొన్ని వర్గాల్లో వ్యక్తమవుతోంది. కానీ పరిపాలనలో, అభివృద్ధి, సంక్షేమంలో బీసీలకు జనాభా దామాషా ప్రకారం న్యాయమైన వాటా లభించాలంటే కులాల వారీగా లెక్కలు తీయాల్సిందేనన్న వాదన పెరుగుతోంది. ఈ నేపథ్యంలో బిహార్‌లో ఓబీసీ జనాభా లెక్కలు నిర్వహిస్తే, ఇతర రాష్ట్రాలపై దాని ప్రభావం ఎలా ఉంటుంది? ఇప్పటివరకు కులాలు, మతాల వారీగా జనాభా లెక్కలు ఎప్పడెప్పుడు జరిగాయన్న అంశంపై ఈ రోజు ప్రతిధ్వని.

ABOUT THE AUTHOR

...view details