prathidhwani: రాష్ట్రంలో పల్చటి ప్లాస్టిక్ బంద్.. ప్లాస్టిక్ భూతాన్ని ఈసారైనా..? - etv bharat prathidhwani
prathidhwani: జులై-1 నుంచి రాష్ట్రంలో పల్చటి ప్లాస్టిక్ బంద్. అంటే మరికొద్ది రోజుల్లో.. రాష్ట్రంలో ఎక్కడా 120 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ ఉత్పత్తులు వాడడానికి ఎంతమాత్రం వీలు లేదు. నిబంధనలు మీరి.. ఏ దుకాణంలో అయినా అలాంటి కవర్లు ఇస్తే రూ.5 వేలు జరిమానా. ఇప్పటిలా ఇష్టానుసారం ఎక్కడపడితే అక్కడ కవర్లు వాడి పడేస్తే.. పౌరులకు కూడా రూ.500 వరకు పెనాల్టీ తప్పదు. రాష్ట్రంలోని అన్ని నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాల్లో దీన్ని అమలు చేయాలని పురపాలకశాఖ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. వాటి తయారీ, సరఫరా, విక్రయం, వినియోగంపై నిషేధం అమల్లో ఉంటుంది. ఈ నిర్ణయం నేపథ్యం ఏమిటి? గతంలోలా కాకుండా ఈ ప్లాస్టిక్ భూతాన్ని సమర్థంగా తరమికొట్టడంలో ప్రజల్లో కలిగించాల్సిన అవగాహన, చూపించాల్సిన ప్రత్యామ్నాయాలు ఏమిటి? ఇదే అంశంపై నేటి ఈటీవీ భారత్ ప్రతిధ్వని.