Prathidhwani: సంప్రదాయ వైద్యాల్లో ఔషధాల ప్రామాణికత నిర్ధరణ ఎలా? - Homeopathy Medicine
ప్రాణుల ఆవిర్భావానికి, వాటి మనుగడకు మూలాధారం ప్రకృతి. నిరంతరం జరిగే భౌగౌళిక, వాతావరణ మార్పులకు అనుగుణంగా జంతువులు, వృక్షాలు, సూక్ష్మజీవులు, శిలీంధ్రాల స్వరూప స్వభావాలు రూపాంతరం చెందుతుంటాయి. ఈ పరిణామ క్రమంలో ఊహించని విపత్తులు విరుచుకు పడతాయి. నవీన జీవనానికి ఊపిరిపోసే ఆదరువులూ ఆవిర్భవిస్తాయి. ఈ క్రమంలోనే ఒకవైపు ఘోరకలిని సృష్టించే అంటువ్యాధులు ప్రబలుతుంటే... ఇంకోవైపు ఆ గాయాలను మాన్పే దివ్యమైన ఔషధాలను ప్రసాదిస్తోంది... వైవిధ్యమైన ప్రకృతి. ఇలాంటి ప్రకృతి అందిస్తున్న ఔషధాల గురించి, ప్రస్తుత సమాజ అవసరాలకు జరగాల్సిన ఔషధ ప్రయోగాల గురించి ఈరోజు ప్రతిధ్వని.