రహదారిపై చెరుకు లోడ్ ఆపి దర్జాగా తిన్న గజరాజు - Elephant sugarcane video
తమిళనాడులోని ఓ ఏనుగు హల్చల్ చేసింది. ఈరోడ్ జిల్లాలోని సత్యమంగళం నుంచి తళావడి వైపు చెరుకు లోడ్‌తో వెళ్తున్న లారీకి అడ్డుగా నిల్చొని చెరుకు తినడం ప్రారంభించింది. కాసేపటి తర్వాత చెరుకు కట్టను లారీ డ్రైవర్.. ఏనుగుకు ఇవ్వగా అక్కడి నుంచి అడవిలోకి వెళ్లిపోయింది. ఈ ఘటన వల్ల గంటపాటు ట్రాఫిక్ జామ్ అయింది. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.