ఘనంగా 'గజరాజు' బర్త్‌డే వేడుకలు.. స్పెషల్ కేక్ కట్ చేయించి.. - jharkhand latest updates
ఝార్ఖండ్‌లోని సరాయ్కేలాలో ఓ ఏనుగు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. దల్మా వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో రజనీ అనే గజరాజుతో కేక్ కట్ చేయించారు అధికారులు. ఏనుగుకు అరటి పళ్లతో పాటు సొరకాయలను తినిపించారు. వన్యప్రాణి వారోత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని సంరక్షణా కేంద్రం యాజమాన్యం తెలిపింది. ఈ వేడుకలకు జూ సిబ్బందితో పాటు గ్రామస్థులు హాజరయ్యారు. రజనీ పుట్టినరోజు వేడుకలు జరపడం చాలా సంతోషంగా ఉందని అధికారులు తెలిపారు.