పగిలిన దేవాదుల పైప్‌లైన్... ఫౌంటెన్లా ఎగిసిపడ్డ నీరు - devadula pipeline damag
హనుమకొండ జిల్లా దామెర మండలం పులుకుర్తి సమీపంలో దేవాదుల పైప్‌లైన్ లీకైంది. దీంతో నీరు ఉవ్వెత్తున ఎగసిపడింది. చలివాగు ప్రాజెక్టు నుంచి భీమ్ ఘన్‌పూర్‌కు వెళ్లే మార్గంలో ఈ పైప్‌లైన్ లీకేజీ జరిగింది. విషయం తెలుసుకున్న అధికారులు చలివాగు వద్ద మోటార్లను ఆపేశారు. అప్పటికే భారీగా విరజిమ్మిన నీరు సమీపంలోని పొలాలను ముంచెత్తింది. వరదనీటితో పొలాలు మునిగిపోయాయి. మొన్నటి వరకు వర్షాలు, ఇప్పుడీ లీకేజీతో వరినారు దెబ్బతిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.