తెలంగాణ

telangana

ETV Bharat / videos

కాలనీల్లో పులి సంచారం.. ఇళ్లలోకి మొసళ్లు.. భయంభయంగా జనం! - dog bike ride

By

Published : Jul 14, 2022, 5:49 PM IST

భారీ వర్షాలతో గుజరాత్​ వడోదరాలోని విశ్వామిత్రీ నది ఉప్పొంగి.. వరద నీరు ఇళ్లలోకి వస్తోంది. దీంతో.. మొసళ్లు కూడా కొట్టుకొస్తున్నాయి. జనం భయాందోళనలకు గురవుతున్నారు. అటవీ అధికారులు వచ్చి వాటిని బంధించారు. మరోవైపు.. కేరళ వయనాడ్​లో నివాస ప్రాంతాల్లో పులి సంచారం కలకలం రేపుతోంది. సుల్తాన్​ బేథరీ వద్ద.. ఓ పెంపుడు కుక్కను వేటాడి చంపేసింది క్రూరమృగం. గతంలోనూ.. మనుషుల ప్రాణాలు బలిగొన్నాయి పులులు. దీంతో.. జనం ఆందోళన చెందుతున్నారు. తమిళనాడు కోయంబత్తూర్​లో స్కూటీ వెనుక కూర్చొని హుందాగా ప్రయాణిస్తోంది ఓ శునకం. మహిళ స్కూటీ నడుపుతుండగా.. కుక్క చక్కగా బ్యాలెన్స్​ చేసుకుంటూ జర్నీని ఆస్వాదిస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

ABOUT THE AUTHOR

...view details