చిత్రకోట్, జోగ్ జలపాతాల కనువిందు.. సుందర దృశ్యాలు! - చిత్రకోట్ జలపాతం వీడియో
దేశవ్యాప్తంగా గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు నిండుకుండలా మారాయి. చెరువుల్లో జలకళ ఉట్టిపడుతోంది. దీంతో జలపాతాలు నీటితో కళకళలాడుతున్నాయి. ఎత్తైన గుట్టల నుంచి జాలువారే నీటిధారలు చూపు తిప్పుకోనివ్వడం లేదు. కర్ణాటకలోని జోగ్ జలపాత దృశ్యాలు పర్యటకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన నయాగరా జలపాతాలను పోలి ఉండే ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్‌పుర్‌లో ఉన్న చిత్రకోట్ జలపాతం కనువిందు చేస్తోంది. హోయలొలుకుతూ ఎర్రని రంగులో ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. దీంతో జలపాతం వద్ద ఫొటోలు దిగుతూ పర్యటకులు ఎంతగానో ఎంజాయ్ చేస్తున్నారు. రుతువు రుతువుకు ఈ జలపాతం రంగులు మారడం విశేషం.