శ్మశానంలో బర్త్డే పార్టీ చేసుకున్న నటి.. అదే కారణమట! - actress birthday party in grave yard
శ్మశానంలో పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంది నటి ఆర్యా ఘారే. మంగళవారం మహారాష్ట్ర పుణె జిల్లా పింప్రీ చించ్వడ్లోని శ్మశాన వాటికకు వెళ్లి.. కొందరు దర్శకులు, నిర్మాతల సమక్షంలో కేట్ కట్ చేసింది. మూఢనమ్మకాలపై వ్యతిరేక ప్రచారంలో భాగంగా ఆమె ఇలా చేసింది. బాలీవుడ్, మరాఠీ చిత్ర పరిశ్రమల్లో నటిగా గుర్తింపు తెచ్చుకుంది ఆర్యా ఘారే. సునీల్ షెట్టి-తమన్నా కలిసి నటించిన 'ఏఏ బీబీ కేకే' సహా మరికొన్ని బాలీవుడ్ సినిమాల్లో ఆర్యా కనిపించింది.
TAGGED:
actress aarya ghare news