ప్రతిధ్వని: సంక్రాంతి విశిష్టత ఏంటి.. పొంగళ్లు ఎందుకు పెడతారు! - సంక్రాంతి తాజా వార్తలు
శ్రమైక జీవన సౌందర్యానికి, సామాజిక సమైక్య మాధుర్యానికి ప్రతీక సంక్రాంతి. సర్వజన హితాన్ని ఆకాంక్షిస్తూ, సమష్టి తత్వాన్ని ప్రతిబింబిస్తుందీ పండుగ. తెలుగు లోగిళ్లను వెలుగు వాకిళ్లుగా మార్చే ముచ్చటైన, ముగ్ధమనోహరమైన మూడు పండుగల సమాహారంగా సంక్రాంతి సౌందర్యం వెల్లివిరుస్తుంది. ఎన్నో ఆచారాలు, సంప్రదాయాలు, సంస్కృతులు, వైజ్ఞానిక పరమైన అంశాలు ఈ వేడుకలో దాగి ఉన్నాయి. ఈ నేపథ్యంలో నవ్య ఉషస్సుతో, భవ్య తేజస్సుతో తరలివచ్చిన సంక్రాంతి శోభపై ప్రతిధ్వని చర్చ.