ఆహా ఏమీ రుచి.. తినరా మైమరచి! - biryani
ఓ వైపు బంగాళదుంప వేపుడు, మరోవైపు పసందైన బిర్యానీ.. ఇంకో వైపు మండుటెండల్లో చల్లదనాన్నిచ్చే శీతల పానీయాలు.. ఇవన్నీ ఒకే చోట ఉంటే ఇక భోజనప్రియులకు పండగే.. ఇదంతా ఎక్కడ అనుకుంటున్నారా.. భాగ్యనగరంలోని లక్డీకపూల్ సెయింట్ హోటల్లో భోజనప్రియుల కోసం ప్రత్యేకంగా సమ్మర్ ఫుడ్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నారు. ప్రధానంగా కుండ బిర్యానీకి అభిమానులు ఎక్కువ అని హోటల్ నిర్వాహకులు తెలిపారు.