Pratidwani: ఒమిక్రాన్ ప్రమాదకరమా?.. లేక కొవిడ్‌పై పోరాటంలో దూసుకొచ్చిన ఆశాకిరణమా? - ఒమిక్రాన్
Pratidwani: కరోనా కల్లోలం రోజురోజుకూ ఉద్ధృతం అవుతోంది. శరవేగంగా విస్తరిస్తున్నఒమిక్రాన్ వ్యాప్తిని ఆపలేమంటున్నారు కొందరు వైద్య నిపుణులు. దాని లక్షణాలను గుర్తించే లోపే ఒమిక్రాన్ అనేక మందికి వ్యాపిస్తోంది. మరోవైపు కరోనాపై పోరాటంలో మానవాళికి ఉపకారం చేసే అస్త్రంగా ఒమిక్రాన్ మారుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటిస్తే ప్రమాదం ఉండదనీ, పండుగల వేళ అజాగ్రత్తను వీడి అప్రమత్తంగా ఉండాలనీ హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తితో ప్రమాదం పొంచి ఉందా? లేక ప్రయోజనం చేకూరుతుందా? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని.