ప్రతిధ్వని: యాంటీ బాడీలు - వైరస్‌కు బేడీలు
దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం చురుగ్గా సాగుతోంది. అయితే.. వ్యాక్సిన్ తీసుకున్న వారికి.. తీసుకోనివారికి కూడా అనేక అపోహలు కనిపిస్తున్నాయి. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారు.. తమ శరీరంలోకి యాంటీ బాడీలు వచ్చేశాయని అతి విశ్వాసం ప్రదర్శిస్తుంటే.. మరికొంతమంది వ్యాక్సిన్ తీసుకోవడానికే సంశయిస్తున్నారు. అసలీ యాంటీ బాడీలంటే ఏంటి? ఇవి ఎలా వృద్ధి చెందుతాయి? కరోనా వ్యాక్సిన్ ఎంతవరకు అవసరం.. తీసుకోకపోతే కలిగే నష్టాలు ఏంటి?