ప్రతిధ్వని: భారత్‌లో అమెరికా పెట్టుబడులు - prathidwani latest
భారత్‌లో పెట్టుబడులు పెట్టడానికి ఇదే మంచి సమయమని ప్రధాని మోదీ అమెరికా వ్యాపారవేత్తలకు పిలుపునిచ్చారు. టెక్నాలజీ రంగంలో 5జీ, బిగ్‌డేటా, క్వంటాన్ కంప్యూటింగ్, బ్లాక్చైల్, ఇంటర్నెట్ ఆఫ్ తింగ్స్లో ఎన్నో అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయ రంగంలో ఇన్పుట్స్, యంత్రాలు, సరఫరా వ్యవస్థలు, రెడీ టూ ఈట్ ఐటమ్స్‌లో పెట్టుబడులు పెట్టొచ్చు. రక్షణ, అంతరిక్ష రంగాల్లోనూ విస్తృత అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక, బీమా, మౌలిక వసతులు, మెడికల్ టెక్నాలజీ, టెలిమెడిసిన్ వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఇంతకంటే సరైన సమయం దొరకదని మోదీ సూచించారు. ఈ నేపథ్యంలో అమెరికా భారత్‌లో ఏ మేరకు పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందన్న అంశంపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది.