రాత్రి వేళ... నాగార్జున సాగర్ అందాలు చూడతరమా! - నాగార్జున సాగర్ డ్యాం
కృష్ణా నది ఇప్పటికే నీటితో కళకళలాడుతున్న తరుణంలో నాగార్జునసాగర్ జలాశయం రాత్రి పూట విద్యుత్ కాంతులతో సుందరంగా కనిపిస్తుంది. సాగర్ జలాశయం మీద ఉన్న విద్యుత్ దీపాల కాంతులు 20 క్రస్ట్ గేట్ల నుంచి దిగువకు పడుతున్న నీటిపై పడడం వల్ల ఇంకా కొత్తగా కనపడుతోంది. విద్యుత్ లైట్ల కాంతిలో నీటి నుంచి వచ్చే పొగకు ఇంకా సాగర్ తీరం అందంగా కనబడుతోంది.