అగ్నికి లారీ ఆహుతి.. - లారీలో అగ్నిప్రమాదం
మేడ్చల్ జిల్లా కండ్లకోయ సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డుపై సిమెంట్ ట్యాంకర్ అగ్నికి ఆహుతైంది. ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని ట్యాంకర్ దగ్ధం అయ్యింది. పటాన్‌చెరువు వైపు నుంచి కీసర వెళ్తున్న సిమెంట్ ట్యాంకర్ వేగానికి.. టైర్లలో వేడి రాజుకుని మంటలు వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమై డ్రైవర్ ట్యాంకర్‌ను నిలిపివేశాడు. జీడిమెట్ల పారిశ్రామికవాడలోని అగ్ని మాపక కేంద్రం నుంచి వచ్చిన సిబ్బంది మంటలను ఆర్పివేశారు.