చిన్నారుల వయ్యారీ నడకలు - KIDS FASHION CONTEST AT HYDERABAD
బుడిబుడి అడుగులు, వయ్యారి నడకలతో చిన్నారుల ర్యాంప్ వాక్ చూసి ప్రొఫెషనల్ మోడల్స్ సైతం ఆశ్యర్చ పోయారు. ఎంతో అనుభవం ఉన్న ఫ్యాషన్ మోడల్స్‌కు ఏమాత్రం తీసిపోని విధంగా చిన్నారులతో నిర్వహించిన ఫ్యాషన్ షో అదుర్స్ అనిపించింది. ప్రత్యేకంగా తయారు చేసిన దుస్తులను ధరించి ర్యాంపుపై పిల్లలు చేసిన అల్లరి ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. నేషనల్ కిడ్స్ ఫ్యాషన్ కాంటెస్ట్‌లో భాగంగా సిమాఫ్ గ్లోబల్ సంస్థ హైదరాబాద్ మాదాపూర్‌లో కిడ్స్ ఫ్యాషన్ షో నిర్వహించింది. సుమారు 70 మంది చిన్నారులు పాల్గొన్న ఈ కార్యక్రమానికి నటి శుభాంగి పథ్, ప్రముఖ మోడల్ ఇన్షా, హీరో నవీన్ రాజ్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. ఈ కాంటెస్ట్‌లో విజేతలైన చిన్నారులు డిసెంబర్‌లో జరిగే ఇండియన్ ఫ్యాషన్ అండ్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు.