హంసనడకలతో ఆకట్టుకున్న భామలు - hydaerbad
కొత్తగా మోడలింగ్ రంగంలోకి వచ్చిన యువత తమ హంసనడకలతో ఆకట్టుకున్నారు. రిపబ్లిక్ డేను పురస్కరించుకొని హైదరాబాద్‌లోని సిటీ సెంట్రల్ మాల్‌లో ప్రత్యేక ఫ్యాషన్ షోను నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని ర్యాంప్‌పై వయ్యారంగా అడుగులు వేస్తూ అలరించారు. వివిధ విభాగాల్లో జరిగిన ఫ్యాషన్ షోలో మోడ్రన్, సంప్రదాయ వస్త్రాల్లో మెరిసిపోయారు.