ప్రతిధ్వని: తీరికేలేకుండా శ్రమిస్తున్న అమ్మకు తోడుగా నిలిచేదెలా? - కరోనా తాజా వార్తలు
అమ్మంటే... పిలిస్తే పలికే దైవం. జీవితమంతా ఇవ్వడమే తప్ప తీసుకోవడం తెలియని మహా మనిషి. ఆమె... వంటింట్లో పని మనిషై, పంట పొలంలో రైతు కూలీ అయి... ఉద్యోగంలో అధికారిణై... నిరంతర శ్రమకు నిలువెత్తు ప్రతీకగా నిలుస్తోంది. కరోనా కాలంలో పిల్లల ఆన్‌లైన్ చదువులు... అమ్మల బాధ్యతల్ని రెండింతలు చేశాయి. క్షణం తీరిక లేకుండా చాకిరీ చేస్తున్న తల్లులు ఓవైపు.. ప్రాణాలకు తెగించి కరోనా సమరంలో సాగిపోతున్న ధీరమాతలు ఇంకోవైపు. మాృతృదినోత్సవం సందర్భంగా... కరోనా నేపథ్యంలో.. అమ్మపై ఎంత భారం పెరిగింది? అమ్మ చేస్తున్న సేవలకు గుర్తింపు ఎంత? అమ్మకు తోడుగా నిలిచేదెలా?.. ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చ.