ప్రతిధ్వని: అన్ లాక్ 3.0 మార్గదర్శకాలపై కేంద్రం కసరత్తు
దేశవ్యాప్తంగా లాక్డౌన్ ఆంక్షలను కేంద్ర ప్రభుత్వం దశలవారీగా సడలిస్తోంది. ఆగస్టు 1 నుంచి మొదలయ్యే అన్ లాక్ 3.0 మార్గదర్శకాలపై కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అన్లాక్ 3.0లో సినిమా థియేటర్లు, వ్యాయామ శాలలు తెరుచుకునే అవకాశం ఉంది. భౌతిక దూరం పాటిస్తూ 25 శాతం సీటింగ్ సామర్థ్యంతో సినిమా థియేటర్లకు కేంద్ర ప్రభుత్వం అనుమతివ్వనుంది. మెట్రో రైళ్ల నిలిపివేత, పాఠశాలల మూసివేతపై యథాతథ స్థితిని కొనసాగించనుంది. అయితే కరోనా కేసులను బట్టి సొంత మార్గదర్శకాలను నిర్ణయించుకునే అధికారాలని రాష్ట్రాలకివ్వాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో అన్ లాక్ 3.0 మార్గదర్శకాలపై ప్రతిధ్వని చర్చ...