Prathidwani: అసలు ధాన్యం కొనుగోళ్లలో ఎవరి బాధ్యత ఎంత?
రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగుతున్నాయి. రైతులు పండించిన ధాన్యం పూర్తిగా కేంద్రం కొనుగోలు చేయాలని అధికార తెరాస పట్టుబడుతోంది. ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్రానికో విధానం అవలంభిస్తూ కేంద్రం వివక్ష ప్రదర్శిస్తోందని ఆరోపిస్తోంది. అయితే... పంటకు మద్దతు ధర ప్రకటించి కేంద్రమే ధాన్యం కొనుగోలు చేస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం సేకరణకు అవసరమైన మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించడం లేదని భాజపా ఆరోపిస్తోంది. ఇదే వాదనతో రెండు పార్టీలు పోటాపోటీగా నిరసనలకు పిలుపునిచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలకు దిగుతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు ధాన్యం కొనుగోలు చేసే విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఎవరి బాధ్యత ఎంత? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని.