తెలంగాణ

telangana

ETV Bharat / videos

TTD: శ్రీవారికి వైభవంగా చక్రస్నానం.. స్వామివారి సన్నిధిలో సీజేఐ - బ్రహ్మోత్సవాలు చక్రస్నానం

By

Published : Oct 15, 2021, 12:12 PM IST

తిరుమల బ్రహ్మోత్సవాల్లో చివరి అంకమైన శ్రీవారి చక్రస్నానం వైభవంగా సాగింది. కరోనా దృష్ట్యా ఆలయంలో ఏకాంతంగా చక్రస్నానం నిర్వహించారు. ఉత్సవ రోజుల్లో బహురూపులతో.. విభిన్న వాహనాల్లో దర్శనమిచ్చాడు దేవదేవుడు.. ఆనంద నిలయానికి చేరుకునే ముందు.. ఆ స్వామికి, ఉభయ దేవేరులకు.. చక్రత్తాళ్వార్లకు.. స్నపన తిరుమంజనం నిర్వహించారు. పంచామృతాలతో అర్చకులు చేసే అభిషేక కైంకర్యాన్ని అందుకుని.. ధూప దీపాదికంతో వేంకటేశ్వరుడు ప్రసన్నుడయ్యాడు. ఈ కార్యక్రమం తర్వాత.. స్వామి ప్రతినిధిగా చక్రత్తాళ్వారుకి వరాహ పుష్కరిణిలో స్నానమాచరింపజేశారు. కరోనా వేళ.. ఆలయం లోపలే ప్రత్యేకంగా తీర్చిదిద్దిన పుష్కరిణిలో.. చక్రత్తాళ్వారుకి స్నానమాచరింపజేశారు. శ్రీవారి చక్రస్నానం కార్యక్రమంలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ హాజరయ్యారు. ఆయనతో పాటు పలువురు సుప్రీంకోర్టు, ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details