LIVE VIDEO: రోడ్డు దాటుతూ వరదలో కొట్టుకుపోయిన రైతు.. - telangana varthalu
ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి పలుచోట్ల వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం తాళ్లసింగారం వద్ద పీతిరి వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. రోడ్డుదాటేందుకు సైకిల్‌పై వెళ్లేందుకు యత్నించిన ఓ రైతు వాగులో కొట్టుకుపోయాడు. వెంటనే స్పందించిన యువకులు రైతును సురక్షితంగా వరద నుంచి కాపాడి ఇంటికి పంపించారు. అయితే సైకిల్ మాత్రం వరదల్లో కొట్టుకుపోయింది.