300ఏళ్ల నాటి బావిలో.. క్లిఫ్ డైవింగ్ - cliif drivers
రాజస్థాన్ జోధ్‌పుర్ వేదికగా జరుగుతున్న క్లిఫ్ డైవర్స్ ఛాంపియన్‌షిప్‌లో క్రీడాకారులు సత్తాచాటుతున్నారు. కొలంబియాకు చెందిన ఓర్లాండో డ్యూక్, ఆస్ట్రేలియా ప్లేయర్ రిహియానన్ ఇఫ్లాండ్.. 20 మీటర్ల ఎత్తు నుంచి బావిలోకి దూకారు. ఈ బావిని 300 ఏళ్ల క్రితం జోధ్‌పుర్ మహారాజు అభయ్ సింగ్ భార్య నిర్మించింది. ప్రజా వినియోగం కోసం అప్పట్లో దీనిని ఏర్పాటు చేశారు. ఈ పర్యాటక ప్రాంతంలో క్లిఫ్ డైవింగ్ పోటీలు నిర్వహించడం ఇదే తొలిసారి.