తెలంగాణ

telangana

ETV Bharat / videos

'అఖండ, పుష్ప చిత్రాలు ప్రేక్షకుల్లో నమ్మకాన్ని కలిగించాయి' - ఆది సాయికుమార్ అతిథి దేవోభవ

By

Published : Jan 5, 2022, 7:00 PM IST

కరోనా కారణంగా థియేటర్​కు, ప్రేక్షకుడికి మధ్య చిన్న భయం ఏర్పడిందని, అది పూర్తిగా పోయే రోజులు వచ్చాయని యువ కథానాయకుడు ఆది సాయికుమార్ అన్నారు. 'అఖండ', 'పుష్ప' చిత్రాలు ప్రేక్షకుల్లో నమ్మకాన్ని నిలిపి థియేటర్​కు వచ్చేలా చేశాయని ఆనందం వ్యక్తం చేశారు. తన తాజా చిత్రం 'అతిథిదేవోభవ' ఈనెల 7న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా ఈటీవీతో మాట్లాడిన ఆది.. ఒంటరి తనం వల్ల కలిగే భయంతో బాధపడే ఓ యువకుడి కథతో తన సినిమా ఉండబోతుందని స్పష్టం చేశారు. ఇంటిల్లిపాదిని అలరించే అన్ని అంశాలు సినిమాలో ఉన్నాయని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details