'ప్రలోభాలకు లొంగం, భవిష్యత్‌ను ఆగం చేసుకోం' - తెలంగాణ యువ ఓటర్ల ఇంటర్వ్యూ
Published : Nov 3, 2023, 6:38 AM IST
Youth Voters Interview on Assembly Elections 2023 : రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల జోరు కనిపిస్తోంది. అభ్యర్థులు, పార్టీలు ప్రచారంలో మునిగితేలుతున్నాయి. అభ్యర్థులు తాము గతంలో చేసినవి.. భవిష్యత్‌తో చేయాలనుకుంటున్న అంశాలు సహా.. ఇతర పార్టీల లోపాలను సైతం ఎత్తిచూపుతూ ప్రచార జోరు కొనసాగిస్తున్నారు. మేనిఫెస్టోలు, హామీలతో ఎన్నికల ప్రచారం వాడీవేడీగా సాగుతోంది. అయితే తెలంగాణ ఎన్నికల్లో యువ ఓటర్లు అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. ఈ తరుణంలో ఈసారి తెలంగాణలో 25 లక్షల మంది కొత్తగా ఓటుహక్కు పొందారు. ఇంత భారీసంఖ్యలో ఉన్న యువత ఓటుహక్కుపై చైతన్యంతో ఉన్నారు.
Telangana Young Voters Interview :నిజాయితీ గల అభ్యర్థి, ఆయా పార్టీలు ప్రకటిస్తున్న మేనిఫెస్టోలు, ఐదేళ్లలో చేసిన అభివృద్ధి.. వచ్చే పదవీకాలంలో చేయబోయే పనులేంటి..? ఇలా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని ఓటేస్తామని ధీమాగా చెబుతున్నారు యువ ఓటర్లు. తమ భవితవ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఓటును వేస్తామని.. ఓటు అస్త్రంగానే కాకుండా తమ బాగోగులు మార్చే హక్కును బాధ్యతాయుతంగా వేస్తామంటున్నారు. పార్టీలు ప్రకటించే ఉచితాలు, ప్రలోభాలకు లొంగకుండా.. అభివృద్ధి చేసే అభ్యర్థులకే పట్టం కట్టాలంటున్న యువతతో ఈటీవీ భారత్ ముఖాముఖి.