కొమ్ములతో కుమ్మేసిన ఎద్దు.. కాలితో యువకుడి ఛాతిలో తన్ని.. - తమిళనాడు ఎడ్లపందెంలో సురేశ్ మృతి న్యూస్
తమిళనాడు వేలూరు మారుతవల్లిపాళయం సమీపంలో నిర్వహించిన ఎద్దుల పందెంలో సురేశ్(28) అనే యువకుడు మృతిచెందాడు. అన్నానగర్‌లో శుక్రవారం ఈ ఎడ్ల పందెం జరిగింది. ఈ పందెంలో 215 ఎద్దులు పాల్గొన్నాయి. బుల్ రన్ కోసం బారికేడ్లు ఏర్పాటు చేశారు. అయితే కొందరు యువకులు కంచె దాటుకుని వచ్చి ఎద్దుపై దాడి చేశారు. ఆగ్రహంతో ఎద్దు లోపల నిలబడి ఉన్న యువకులపైకి దూసుకెళ్లింది. దీంతో కొంతమంది యువకులు కిందపడిపోయారు. వారిలో గుడియాత్తం పక్కనే ఉన్న లింగుండ్రం ప్రాంతానికి చెందిన సురేశ్ అనే యువకుడి ఛాతిపై ఎద్దు కాలితో తొక్కింది. తీవ్రగాయాలపాలైన అతడిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సురేశ్ మృతి చెందాడు. వ్యక్తిపై ఎద్దు దాడి చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
TAGGED:
tamilnadu bull race news