ప్రేమ జంటను చితకబాదిన గ్రామస్థులు.. అల్లుడిపై అత్తింటివారి దాడి - హరియాణా న్యూస్
హరియాణాలోని ఫతేహాబాద్లో ఓ ప్రేమజంటను చితకబాదారు గ్రామస్థులు. యువకుడితో కలిసి ఉండటం చూసిన బాలిక కుటుంబసభ్యులు.. ఆగ్రహంతో ఇద్దరినీ పిడిగుద్దులు గుద్దారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే దీనిపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. ఫతేహాబాద్లో జరిగిన మరో ఘటనలో భర్త కుటుంబంపై దాడిచేశారు భార్య కుటుంబసభ్యులు. అంతకుముందే అత్త, కోడలు మధ్య గొడవ జరిగింది. దీంతో ఆ మహిళ తన కుటుంబ సభ్యులకు చెప్పింది. ఆగ్రహానికి గురైన వారు.. అల్లుడు, అతడి తల్లిని ఇంట్లోకి ప్రవేశించి కొట్టారు. ఈ ఘటన సంబంధించిన దృశ్యాలన్నీ ఇంట్లోని సీసీటీవీలో రికార్డయ్యాయి. దీంతో ఈ వీడియో సోషల్మీడియాలో వైరల్గా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST