Young Man Attacked Woman : ప్రేమ పేరుతో యువతిపై దాడి.. చికిత్స పొందుతూ చనిపోయిన యువతి... - యువతికి సంఘీబావంగా క్రొవ్వత్తుల ర్యాలీ
Published : Sep 25, 2023, 2:18 PM IST
|Updated : Sep 25, 2023, 2:52 PM IST
Young Man Attacked Woman in Nizamabad : ప్రేమ పేరుతో వేధించి, యువతి చావుకు కారణమైన వ్యక్తిని శిక్షించాలంటూ నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లిలో ఎస్సీ సంఘాలు ఆందోళనకు దిగాయి. జక్రాన్‌పల్లికి చెందిన గౌసోద్దీన్ అనే యువకుడు.... అదే గ్రామానికి చెందిన యువతిని బలవంతంగా బైక్‌పై ఎక్కించుకుని వెళ్లాడు. ఈ క్రమంలోనే ఆమెను వాహనంపై నుంచి తోసేయటంతో తీవ్రంగా గాయపడింది. దీంతో ఆ యువతిని ఇంటి వద్ద వదిలేసి వెళ్లాడు. గాయపడిన యువతిని మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ యువతి మృత్యువాత పడింది.
ఆ అమ్మాయి మృతికి కారణమైన యువకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఎస్సీ సంఘాలు జక్రాన్‌పల్లి అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశాయి. యువతికి సంఘీబావంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. నిందితుడిని అరెస్టు చేయని పక్షంలో ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. యువతి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు. జక్రాన్‌పల్లిలో బందోబస్తు ఏర్పాటు చేశారు.