తెలంగాణ

telangana

Young Farmer

ETV Bharat / videos

Young Farmer Mohammad Adeeb Ahmed Success Story : ఉద్యోగం వదిలేశాడు.. సాగులో లక్షలు సంపాదిస్తున్నాడు.. - A young man left his software job started farming

By ETV Bharat Telangana Team

Published : Sep 9, 2023, 5:48 PM IST

Young Farmer Mohammad Adeeb Ahmed Success Story :వ్యవసాయంలో ఉపాధి కల్పించాలనేది ఆ యువ రైతు ఆశయం. ఆ ఆశయాన్ని ఆచరణలోకి తీసుకువచ్చేందుకు.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగానికి స్వస్తి పలికాడు. సరికొత్త పంథాలో సమీకృత వ్యవసాయం చేస్తూ.. అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నాడు. ఆ యువ రైతే రంగారెడ్డి జిల్లాకు చెందిన మహ్మద్‌ అదీబ్‌ అహ్మద్‌ (Mohammad Adeeb Ahmed). మట్టి వాసన ఆస్వాదిస్తూ తనకున్న 10 ఎకరాల విస్తీర్ణంలో.. వరి సహా పాడి, దేశవాళీ కోళ్ల పెంపకం, మామిడి, బొప్పాయి, జామ, వాటర్ ఆపిల్‌ లాంటి పండ్ల తోటలు, దొండ, బీరలాంటి కూరగాయలు, గులాబీ పూల పైర్లు యాంత్రీకరణ సాయంతో సేంద్రీయ విధానంలో సాగు చేస్తూ మరో పది మంది ఉపాధి కల్పిస్తున్నాడు. 

స్వీయ మార్కెటింగ్ విధానాలు అవలంభిస్తుండటంతో అన్ని రకాల ఖర్చులు పోను నెలకు మంచి ఆదాయంపొందుతున్నాడు. మరీ, వ్యవసాయం చేస్తూ.. అన్నదాతలంతా నష్టపోతుంటే తనేలా లాభాలు పొందుతున్నాడు.? మార్కెటింగ్‌కు అతడు అనుసరించిన విధానం ఏంటి..? అసలు ఏఏ పంటలు సాగు చేస్తున్నాడో.. ఆ హైటెక్‌ రైతునే అడిగి తెలుసుకుందాం.

ABOUT THE AUTHOR

...view details