తెలంగాణ

telangana

Women Fight Because Bus Seat Viral

ETV Bharat / videos

ఫ్రీ బస్ ఎఫెక్ట్ ​- సీటు కోసం చెప్పులతో కొట్టుకున్న మహిళలు - బస్సులో కొట్టుకున్న మహిళలు వీడియో

By ETV Bharat Telangana Team

Published : Jan 18, 2024, 3:35 PM IST

Women  Fight Because Bus Seat Viral: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో ఆర్టీసీ బస్సులు నిత్యం కిక్కరిసి పోతున్నాయి. బస్సులో సీటు చాలా చోట్ల అందని ద్రాక్షలా మారిపోయింది. ఈ క్రమంలో పలుచోట్ల ఘర్షణలు జరుగుతున్నాయి. తాజాగా  సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక నియోజకవర్గంలో ఇద్దరు మహిళల మధ్య సీటు విషయంలో వాగ్వాదం జరిగింది. ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం గజ్వేల్​ ప్రజ్ఞాపూర్​ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు సికింద్రాబాద్​ నుంచి సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక నగర కేంద్రానికి బయల్దేరింది. ఈ సమయంలో తొగుట మండలం వెంకట్రావు పేటకు వచ్చే సమయానికి బస్సు కిక్కిరిసిపోయింది.

Women  Fight in TSRTC Bus Video : బస్సు ప్రయాణికులతో నిండిపోవడంతో చాలా మంది మహిళలకు సీట్లు దొరకలేదు. దీంతో సీట్ల కోసం గొడవ జరిగింది. సీటు తమదంటే తమదంటూ గొడవకు దిగారు. మాటలు కాస్త కొట్టుకునే దాకా వెళ్లింది. ఇరువురు ఒకరిపై ఒకరు చెప్పులతో దాడి చేసుకున్నారు. వారు గొడవ పడిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అవుతోంది. 

ABOUT THE AUTHOR

...view details